పంచాయితీల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ పాలన

రాష్ట్రంలో పంచాయితీల పదవీకాలం ఆగస్ట్ 1వ తేదీతో ముగియబోతోంది. కనుక పంచాయితీలన్నీ రద్దు అవుతాయి.  కానీ నేటికీ పంచాయతీ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు కనుక ఎన్నికలు జరిగి మళ్ళీ పంచాయతీ పాలకమండళ్ళు ఏర్పాటయ్యేవరకు ఆగస్ట్ 2నుంచి స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా పాలన కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయితీలు కూడా ఆగస్ట్ 2 నుంచే అమలులోకి వస్తాయి. కనుక స్పెషల్ ఆఫీసర్లను నియమించుకొని, పంచాయతీ పాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,  పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేయవలసిందిగా రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ తన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.