14.jpg)
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం హైకోర్టు విభజనపై ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు విభజనకు నిర్దిష్టమైన గడువు ఏదీ లేదని దానిలో పేర్కొంది. రెండు రాష్ట్రాలకు 10 ఏళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొందని పేర్కొంది. అంటే హైకోర్టు విభజనకు పదేళ్ళ సమయం ఉందని చెప్పకనె చెప్పింది. అయితే హైకోర్టు ఏర్పాటుకు ఏపి సర్కార్ తగిన భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసి ఉందని పేర్కొంది. ఏపిలో హైకోర్టు ఏర్పాటు వ్యవహారం ఏపి సర్కార్-ఉమ్మడి హైకోర్టులపైనే ఆధారపడి ఉందని అఫిడవిట్ లో పేర్కొంది. అవి రెండూ చొరవ తీసుకొని ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు సిద్దమయితే హైకోర్టు విభజనకు కేంద్రం విభజన ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్దంగా ఉందని పేర్కొంది. అంటే హైకోర్టు విభజన భాద్యత నుంచి కూడా కేంద్రం చేతులు దులిపేసుకొందని అర్ధమవుతోంది.
కానీ ఏపిలో హైకోర్టుకు ప్రస్తుతం చురుకుగా పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరులోగా హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తికావచ్చునని, జనవరి 2019 నుంచి ఏపిలో హైకోర్టు పనిచేయడం ప్రారంభించే అవకాశాలున్నాయని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కనుక అప్పటి వరకు వేచి చూడకతప్పదు.