ఆ నలుగురికి ఉరే సరి: సుప్రీంకోర్టు

నిర్భయకేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరోసారి ఉరిశిక్ష ఖరారు చేసింది. వారు పెట్టుకొన్న రివ్యూ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.భానుమతి లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు తుది తీర్పు వెలువరించింది. 

“గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోపం ఉందని ఆ నలుగురు నిరూపించలేకపోయారు. వారు నలుగురికీ తాము నిర్దోషులమని నిరూపించుకొనేందుకు న్యాయస్థానం చాలా అవకాశమే కల్పించింది. కానీ నిరూపించుకోలేకపోయారు. కనుక వారి రివ్యూ పిటిషన్ తిరస్కరించి వారు నలుగురికి మరణశిక్షను ఖరారు చేస్తున్నాము,” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీర్పు చెప్పారు.