
తెరాస ఎంపి బాల్క సుమన్ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఈరోజు మీడియాలో వస్తున్న వార్తలను చూసి మంచిర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ శుక్రవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఈకేసు గురించి మీడియా ప్రతినిధులకు వివరించారు. “ఈ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. నిజానికి ఈ కేసులో బాల్క సుమన్ నిందితుడు కాదు భాదితుడు. ఈ కేసులో బాధితులుగా చెప్పుకొంటున్న సంధ్య, విజేత అనే ఇద్దరు మహిళలు ఆయనను డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. అందుకోసం వారిరువురూ ఎంపి బాల్క సుమన్ ఫ్యామిలీ ఫోటోను మార్ఫింగ్ చేసి అయన వద్ద నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించారు. ఇది జరిగి ఆరు నెలలయింది. అప్పుడే ఎంపి పిర్యాదు మేరకు వారిరువురిపై సెక్షన్స్ 420,292A 419,506 క్రింద కేసులు కూడా నమోదు చేశాము. మళ్ళీ జూన్ 7వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా వారిపై కేసులు నమోదు చేయబడ్డాయి,” అని సిఐ మహేష్ వివరించారు.