
తెరాస ఎంపి బాల్క సుమన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెరాస తరపున ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కొనే వ్యక్తిగా అందరికీ తెలుసు. అయితే ఆయనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇద్దరు పాత్రికేయులు, ఇద్దరు న్యాయవాదులు పిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాసినట్లు తాజా సమాచారం. భాదిత మహిళలలో ఒక మహిళా జర్నలిస్టు కూడా ఉండటం విశేషం.
ఎంపి సహాయకుడు మర్రి సునీల్ జూన్ 7వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నలుగురు వ్యక్తులపై పిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. బంజారా హిల్స్ లో ఎంపి బాల్కా సుమన్ నివాసం ఉంది. ఈ ఏడాది మే 31వ తేదీన ఎవరూ లేని సమయంలో సంధ్య, విజేత, శంకర్, గోపాల్ అనే నలుగురు వ్యక్తులు అయన ఇంట్లోకి జొరబడి తనపై దౌర్జన్యం చేసి ఎంపి కోసం ఇల్లంతా వెతికారని, కానీ ఇంట్లో ఎవరూ కనబడకపోవడంతో వారు ఎంపిని బూతులు తిడుతూ వెళ్లిపోయారని మర్రి సునీల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయన పిర్యాదు మేరకు పోలీసులు ఆ నలుగురిపై ఐపిసి సెక్షన్స్: 448,506 క్రింద కేసులు నమోదు చేశారు.
ఆ తరువాత వారి వారిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అదుపులోకి తీసుకొని, ఎంపి లైంగిక వేధింపుల గురించి నోరుమెదపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించారని పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు విస్ రావు, ఎంఎస్.రెడ్డి తెలిపారు. నిజానికి సంధ్య, విజేతలు నిందితులు కారని ఎంపి భాదితులని వారు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎంపి బాల్కా సుమన్ ఇంకా స్పందించవలసి ఉంది.