నాగం వెరీ హ్యాపీ

కాంగ్రెస్ నాగం జనార్ధన్ రెడ్డికి హైకోర్టు చాలా సంతోషం కలిగించే తీర్పు చెప్పింది. అయన వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు, అయనకు మళ్ళీ ఇద్దరు గన్ మ్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయనకు గన్ మ్యాన్లను ఎందుకు తొలగించిందో కూడా తెలియజేయాలని హైకోర్టు ఆదేశించి, ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

వాస్తవానికి కోర్టును ఆశ్రయించి తన భద్రతను పునరుద్దరించుకోవాలనుకోవడం తప్పుకాదు. కానీ ఈవిధంగా ఏదో ఒక సాకుతో తరచూ ప్రభుత్వంపై పిటిషన్లు వేయడం ద్వారా అటు పార్టీ అధిష్టానం దృష్టిని, ఇటు మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చుననే తాపత్రయం కూడా ఉండవచ్చు. ఈ కేసులో నాగం జనార్ధన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది..అయన వేసిన పిటిషన్ కారణంగా తెరాస సర్కార్ ఇబ్బందికర పరిస్థితి కలుగుతుంది కనుక కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధిష్టానం గుర్తింపు లభించవచ్చు.