సంబంధిత వార్తలు

ఇటీవల తెలంగాణాలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు 9 దశాబ్దాల క్రితం నిర్మించిన గౌలిగూడలోని పాత సిబిఎస్ బస్టాండ్ పైకప్పు ఈరోజు ఉదయం కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్టీసి అధికారులు నాలుగు రోజుల క్రితమే ఆ బస్టాండ్ లోకి బస్సులు, ప్రయాణికులు వెళ్ళకుండా నిలిపివేసి, ముందస్తు జాగ్రత్తగా బస్టాండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం బస్టాండ్ పైకప్పు కుప్పకూలిపోయింది.