
ఏపి, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ టిబి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం అయన ఛత్తీస్ ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గత రెండున్నరేళ్ళుగా జస్టిస్ రమేష్ రంగనాధన్ హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
పాట్నా (బిహార్) హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్న జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠికి పదోన్నతి కల్పించి ఛత్తీస్ ఘడ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమించారు.
టిబి రాధాకృష్ణన్ కేరళకు చెందినవారు. ఆయన తల్లితండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. అయన కేరళలో విద్యాభ్యాసం ముగించుకొని కర్ణాటకలో ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. 1983 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.