జమ్ము కాశ్మీర్ లో మళ్ళీ గవర్నర్ పాలన

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించబడింది. ఆ రాష్ట్రంలో నడుస్తున్న పిడిపి-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో నుంచి భాజపా తప్పుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. దాంతో సిఎం మహబూబా ముఫ్తీ, ఆమె సహచర మంత్రులు, అలాగే భాజపా మంత్రులు అందరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. కనుక గవర్నర్ ఎన్ఎన్ వొహ్రా సిఫార్సు మేరకు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా అన్దోలనకరంగా ఉన్నందున పిడిపితో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలేవీ ఆసక్తి చూపడం లేదు. కనుక గవర్నర్ పాలన అనివార్యమైంది.