
హైదరాబాద్ నగరవాసులకు ఓ శుభవార్త. అమీర్ పేట-ఎల్.బి. నగర్ కారిడార్ లో మెట్రో ట్రయల్ రన్స్ మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. జూలై నెలాఖరు వరకు కారిడార్ లో మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహించి, అన్ని అనుమతులు పొందేక ఆగస్ట్ నుంచి ఈ మార్గంలో కూడా మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించడానికి మెట్రో అధికారులు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఎల్.బి.నగర్ నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేటకు బస్సులు, ఆటోలలో చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అయితే 15-20 నిమిషాలలోపే చేరుకోవచ్చు. కనుక ఈ కారిడార్ నగరవాసులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్ట్ నుంచి ఈ మార్గంలో మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.