
రైల్వేమంత్రి పీయూష్ గోయాల్ శుక్రవారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. కాచిగూడ నుంచి నిజామాబాద్ మీదుగా కరీంనగర్ వరకు ప్యాసింజర్ రైలును నేడు సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఈ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఎల్.ఈ.డి. లైటింగ్, 1,10వ నెంబర్ ప్లాట్ ఫారంలపై ఏర్పాటు చేసిన లిఫ్టులను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగవ పాదచారుల వంతెనకు శంఖుస్థాపన చేస్తారు. ఆ తరువాత రాష్ట్రంలో 20 గ్రామీణ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సౌకర్యాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభిస్తారు. ఆ తరువాత కాచిగూడా రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన 400 కిలోవాట్స్ సామర్ధ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు.