సంబంధిత వార్తలు
.jpg)
నాగర్ కర్నూల్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ పై 32 అడుగుల ఎత్తున్న బుద్ధవిగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గురువారం ప్రతిష్టించారు. ఆయన ఎం.జె.ఆర్.ట్రస్ట్ అధ్వర్యంలో ఈ విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ లో తయారుచేయించారు. అక్కడి నుంచి బారీ వాహనంలో దానిని నాగర్ కర్నూల్ తీసుకువచ్చి చెరువులో మద్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ కట్టడంపై బారీ క్రేన్ సహాయంతో ప్రతిష్టించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరువాత నాగర్ కర్నూల్ లోనే ఇంత బారీ బుద్ద విగ్రహం ఏర్పాటు కావడంతో పట్టణానికి అది ప్రత్యేకాకర్షణగా మారనుంది.