
దేశంలో 5 రాష్ట్రాలను మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో భూగర్భ జలవనరుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, వినియోగం, తాగు,సాగునీరు ఏర్పాట్లు, వాటికి అనుసరిస్తున్న విధానాలు మొదలైన 28 అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు ర్యాంకుల్ని ప్రకటించింది. కామన్ వాటర్ మేనేజిమెంట్ ఇండెక్స్ పేరిట విడుదలచేసిన ఆ జాబితాలో గుజరాత్ ప్రధమస్థానంలో నిలువగా ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో తెలంగాణా రాష్ట్రం ఎనిమదవ స్థానంలో నిలవడం విశేషం.
నీతి ఆయోగ్ ఎంచుకున్న 28 అంశాలకు 100 పాయింట్లలో గుజరాత్:76, మధ్యప్రదేశ్:69, ఆంధ్రప్రదేశ్:68, కర్ణాటక:56, మహారాష్ట్ర:55, పంజాబ్:53, తమిళనాడు:51, తెలంగాణా:50, ఛత్తీస్ ఘడ్:49, రాజస్థాన్:48 పాయింట్లు సాధించాయి.
గుజరాత్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా పరిశుద్దమైన త్రాగునీరు అందిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరులను గుర్తించి, వాటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సంరక్షిస్తోందని పేర్కొంది. ఈ జాబితాలో తెలంగాణా 8వ స్థానంలో ఉన్నప్పటికీ అది నీటివనరుల పునరుద్దరణ, ఉపరితల, భూగర్భ జలాలను అద్భుతంగా నిర్వహిస్తోందని నీతి ఆయోగ్ నివేదికలో ప్రశంసించింది.