కరీంనగర్ టు కాచిగూడ రైలు సర్వీస్

కరీంనగర్ జిల్లా ప్రజల చిరకాలకోరిక రేపు నేరవేరబోతోంది. కరీంనగర్ నుంచి కాచిగూడ స్టేషన్ కు జూన్ 15వ తేదీ నుంచి రైల్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దీనిని రేపు ప్రారంభించనున్నారు. 

ఈ రైలు (నిజామాబాద్ ప్యాసింజర్ నెంబర్: 57601) ప్రతీరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రాల్వే స్టేషన్ నుంచి బయలుదేరి సీతాఫల్ మండి, మల్కాజ్ గిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, మెట్ పల్లి, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, గంగాధర, కొత్తపల్లి మీదుగా మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ చేరుకొంటుంది. 

మళ్ళీ మధ్యాహ్నం 2.30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు నిజామాబాద్, రాత్రి 11.00 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకొంటుంది. ఈ ప్యాసింజర్ రైలులో మొత్తం 12 బోగీలు ఉంటాయి. 

ఇదికాక కరీంనగర్ నుంచి ముంబాయికి రైలు ప్రారంభం కాబోతోంది. నిజామాబాద్ వచ్చే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను కరీంనగర్ వరకు పొడిగించాలనే ఎంపి బి వినోద్ కుమార్ విజ్ఞప్తికి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. కనుక త్వరలోనే ఆ రైలు కూడా కరీంనగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.