మాజీప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్

భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని డిల్లీలో ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గత కొన్నేళ్ళుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చాలా కాలంగా ఆయన ఒక కిడ్నీతోనే జీవిస్తున్నారని, దానికీ ఇన్ఫెక్షన్ సోకడంతో ఐసియులో చేర్చి డయాలసిస్ (రక్త శుద్ధి) చేస్తున్నామని ఆయనకు చిరకాలంగా వైద్యసేవలు అందిస్తున్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అయన శరీరం వైద్యానికి స్పందిస్తోందని మెల్లగా కోలుకుంటున్నారని అయన చెప్పారు. అటల్ బిహారీ వాజ్ పేయి వయసు ప్రస్తుతం 93 ఏళ్ళు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వాజపేయిని పరామర్శించి వచ్చారు.