నాన్నగారు ఎన్నడూ రాజకీయాలలోకి రారు: శర్మిష్ఠ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంపై చెలరేగిన దుమారానికి అయన కుమార్తె శర్మిష్ఠ చెక్ పెట్టారు. అయన తన జీవితకాలంలో మళ్ళీ ప్రత్యక్షరాజకీయాలలోకి రారని ఆమె ట్వీట్ చేశారు. 

వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి పూర్తి మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గ్రహించిన భాజపా, అయనను ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి మిత్రపక్షాలను, దేశప్రజలను ఆకట్టుకోవడానికే ఆయనను ఆర్.ఎస్.ఎస్. సమావేశానికి ఆహ్వానించిందని, భాజపాకు దూరమైనా మరోమిత్రపక్షం శివసేన ఆరోపించింది. దానికి జవాబుగా శర్మిష్ఠ ట్వీట్ ద్వారా సమాధానం చెప్పారు.