
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీస్ రెడ్డి ఈరోజు నగరవాసులకు ఒక శుభవార్త చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి అమీర్ పేట-ఎల్బి నగర్ కారిడార్ లోను, అక్టోబర్ నుంచి అమీర్ పేట-హైటెక్ సిటీ కారిడార్ లోను మెట్రో సర్వీసులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. రెండు కారిడార్లలో పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక జెబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆ తరువాత మెట్రో రెండవదశలో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని మెట్రో కారిడార్లను శంషాబాద్ విమానాశ్రయంతో అనుసంధానం చేయబోతున్నామని చెప్పారు. అలాగే నాగోల్ నుంచి ఎల్బి నగర్ మీదుగా ఫలక్ నూమా వరకు మెట్రో సర్వీసులను కలిపి నడిపిస్తామని ఎన్వీస్ రెడ్డి చెప్పారు.