ఆ టెక్నిక్ చాలా పాతదే: కాంగ్రెస్

ప్రధాని నరేంద్రమోడీని హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్లు ఈరోజు దేశవ్యాప్తంగా మీడియాలో ఒక వార్త వచ్చింది. మహారాష్ట్రలోని కొరేగావ్ లో పట్టుబడిన కొందరు వ్యక్తుల వద్ద లభించిన ఒక లేఖ ఆధారంగా ఈ విషయం కనుగొన్నట్లు పూణే పోలీసులు స్థానిక కోర్టుకు తెలియజేశారని, గతంలో రాజీవ్ గాంధీని ఏవిధంగా హత్య చేశారో అదే పద్దతిలో ప్రధాని నరేంద్రమోడీని కూడా హత్య చేయాలని కుట్ర జరుగుతున్నట్లు ఆ లేఖ ద్వారా తెలిసిందని ఆ వార్తల సారాంశం. 

కాంగ్రెస్ పార్టీ దీనిపై అనూహ్యంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ నిరుపమ్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పూణే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ లేఖలో ఏముందో...దానిలో నిజానిజాలు ఏమిటో తెలియదు కానీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈ టెక్నిక్ వాడటం బాగా అలవాటే. ఆయనకు ప్రజాధారణ తగ్గినప్పుడల్లా అయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందనే వార్తలు పుట్టుకువస్తాయి,” అని అన్నారు.