మెట్రో కబుర్లు

అమీర్ పేట- ఎల్బీ నగర్ మెట్రో కారిడార్ లో నేటి నుంచి ట్రయల్ రన్స్ ప్రారంభం కాబోతున్నాయి. కేంద్రప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇనస్పెక్టర్ డివిఎస్.రాజు తన బృందంతో కలిసి గురువారం ఈ కారిడార్ లో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థలను పరీక్షించి చూసి సంతృప్తికరంగా ఉన్నట్లు దృవీకరించడంతో మెట్రో అధికారులు నేటి నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించబోతున్నారు. ఈ నెలాఖరులోగా ఈ కారిడార్ లో అన్ని పనులు పూర్తి చేసి జూలై నుంచి ఈ మార్గంలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభించాలని అధికారులు పట్టుదలతో పనిచేస్తున్నారు.