5.jpg)
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒక బహిరంగలేఖ వ్రాశారు. అసెంబ్లీ సాక్షిగా లక్షా ఏడువేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ నాలుగేళ్ళు పూర్తయినా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ నిరసన తెలియజేయాలనుకున్న నిరుద్యోగ యువత గొంతులను అణచివేశారు. ఇంతకాలం ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలక్షేపం చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారు. నోటిఫికేషన్స్ విడుదల, ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం కారణంగా అనేకమంది నిరుద్యోగ యువతకు వయసు మీరిపోయి ఉద్యోగాలకు అనర్హులు అవుతున్నారు. పోలీస్ శాఖలో కొలువులకు వయో పరిమితిని పెంచాలని ఇందు మూలంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని వ్రాశారు.
రేవంత్ రెడ్డి లేఖ మీడియాకు విడుదల చేసిన కాపీ: