కన్నడ రాజకీయాలు కేరాఫ్ హైదరాబాద్

నిన్నటి వరకు బెంగళూరులో కేంద్రీకృతమైన కన్నడ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ కు మారాయి. కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించాయి. మొదట అందరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించాలనుకొన్నారు. కానీ ప్రత్యేక విమానానికి అనుమతి లభించకపోవడంతో ఎమ్మెల్యేలందరినీ బస్సులలో, కార్లలో తరలించి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో బస ఏర్పాటు చేశారు.

వారిని హైదరాబాద్ లో ఉంచినట్లయితే  ఎడ్యూరప్ప, భాజపాల నుంచి కాపాడుకోవచ్చునని కాంగ్రెస్, జెడిఎస్ లు భావించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నాయి. పైగా సిఎం కెసిఆర్ జెడిఎస్ కు మద్దతు ఇచ్చారు కనుక, అవసరమైతే తెలంగాణా ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయసహకారాలు లభిస్తాయనే భావించి ఉండవచ్చు. వారిని హైదరాబాద్ లో ఉంచినట్లయితే అక్కడి కాంగ్రెస్ నేతలు కూడా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అండగా నిలుస్తారనే ఆలోచనకూడా ఉంది. అందుకు తగ్గట్లుగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలందరికీ అవసరమైన ఏర్పాట్లు చూస్తున్నారు.

వారి భద్రత కొరకు హోటల్ వద్ద బారీగా పోలీసులను మొహరించారు. ఇప్పుడు ఈ అంశంపై తెలంగాణా కాంగ్రెస్-భాజపా నేతల మద్య మాటల తూటాలు పేలవచ్చు. మద్యలో తెరాస నేతలపై కూడా విమర్శలు వస్తే వారు కూడా ధీటుగా స్పందించవచ్చు.న్ : స్క్రోల్ ఇన్ సౌజన్యంతో)