
వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి, వైస్ చైర్మన్ వివేక్ దానిని విడుదల చేశారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నేటి నుంచి 90 రోజులలోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని వారు కోరారు. దాదాపు 47 సం.ల తరువాత మాస్టర్ ప్లాన్ లో అవసరమైన మార్పులు చేశామని వారు తెలిపారు.త్వరలోనే మాష్టర్ ప్లాన్ మొబైల్ యాప్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. నానాటికీ నగరంలో పెరుగుతున్న జనాభాను వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించమని వరంగల్ నగర కమీషనర్ గౌతం తెలిపారు. దీనిలో కాకతీయ టెక్స్ టైల్ పార్క్, ఐటి పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్ మొదలైనవన్నిటినీ జోడించి రూపొందించామని కమీషనర్ గౌతం తెలిపారు.