అందుకే టిజెఎస్ స్థాపించాను: కోదండరాం

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లిలో బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో నిరంకుశ, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. దీని కోసమా మనం పోరాడి తెలంగాణా సాధించుకొన్నది? రాష్ట్రంలో విలువలతో కూడిన ఒక రాజకీయపార్టీ అవసరమని భావించినందునే తెలంగాణా జనసమితిని ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక తెలంగాణా లక్ష్యంగా మా పార్టీ పని చేస్తుంది. ప్రజల మద్దతుతోనే మేము వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నాము,” అని చెప్పారు.

రామగుండంలో టిజెఎస్ నేతలు తీన్మార్ మల్లన్న, విజయ కుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, జెవి రాజు, రాములు గౌడ్ ఆర్. కేశవ్ రెడ్డి గాదె ఇన్నయ్య, రవీందర్, రతన్ రావు, గోపు ఐలయ్య యాదవ్ తదితరులు ప్రొఫెసర్ కోదండరాంకు స్వాగతం పలికారు. అనంతరం వారందరూ రామగుండం పవర్ హౌజ్ నుంచి గోదావరిఖని కోల్ బెల్ట్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.