మెదక్ లో నేడు సిఎం కెసిఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు హెలికాఫ్టర్ లో మెదక్ పట్టణం చేరుకొంటారు. ఔరంగాబాద్ లో రూ.74 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న సమీకృత కలెక్టరేట్, ఎస్పి భవనాలకు సిఎం కెసిఆర్ శంఖుస్థాపనలు చేస్తారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ అతిధి గృహంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యి, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు మెదక్ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత రోడ్డు మార్గాన్న కరీంనగర్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.