2.jpg)
ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ తనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల కోరారు. కానీ దక్షిణాది రాష్ట్రాల ఆర్దికమంత్రుల సమావేశానికి అయన తన ఆర్ధికమంత్రిని పంపించరు,” అని ప్రముఖ పాత్రికేయుడు కూర్మనాధ్ ట్వీట్ చేశారు. తద్వారా కెసిఆర్ ద్వందవైఖరి అవలంభిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కూర్మనాధ్ ట్వీట్ మెసేజ్ పై రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ వెంటనే స్పందిస్తూ, “గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య విభేదాలు ఏర్పడాలని ఎన్నడూ కోరుకోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలనే కోరుకొంటున్నారు. రాష్ట్రాలు బలంగా ఉన్నట్లయితే దేశంకూడా బలంగా ఉంటుందని కెసిఆర్ చెపుతున్నారు. గౌరవ పాత్రికేయుడి కామెంట్స్ ప్రజలను తప్పుద్రోవ పట్టించేవిధంగా ఉన్నాయి,” అని ట్వీట్ చేశారు.