అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. పాలనలొ తన మార్క్, మాట తీరులో తనదైన స్టైల్ తో దూసుకెళుతున్న మంత్రి కేటీఆర్ గూగుల్ లో తన దూకుడు చూపిస్తున్నారు. నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్న తెలంగాణ నాయకుడిగా గూగుల్ సెర్చ్ ఆయన పేరును ఖరారు చేసింది. కాగా అంతకు ముందు మాత్రం తెలంగాణ సిఎం, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ టాప్ లో ఉన్నారు. 2009 తెలంగాణ ప్రకటన సమయంలో, 2014 తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు కేసీఆర్ గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఐదు వేల శాతం కేటీఆర్ గురించి వెతకడం జరుగుతుందట.
హైదరాబాద్ లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుండి కేటీఆర్ ప్రాబల్యం బాగా పెరిగింది. తర్వాత వాటర్ గ్రిడ్ విషయంలో కూడా కేటీఆర్ తనదైన మార్క్ ను వేసుకున్నారు. ఐటీ రంగానికి భారీగా ప్రాజెక్టులను తీసుకువస్తూ ఊతమిస్తున్నారు. అమెరికా పర్యటనలో తాను చేసిన ప్రసంగాలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. మొత్తానికి మొన్నటి దాకా గూగుల్ సెర్చ్ లో కూడా పోటీగా ఉన్న కేసీఆర్ ను కేటీఆర్ దాటేశాడు. తెలంగాణలో అధికంగా నెటిజన్లు వెతుకుతున్న వ్యక్తిగా కేటీఆర్ ఎదిగారు. మరోపక్క ఏపిలో జగన్ టాప్ లో ఉంటే, చంద్రబాబు నాయుడు మాత్రం వెనుకబడ్డారు.