వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్ళి కుదిరింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె తన జూనియర్ అంటే 2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో ప్రేమలో పడ్డారు. వారిప్రేమను ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఫిబ్రవరి 18వ తేదీన డిల్లీలో వారి వివాహం చేయాలని నిర్ణయించిన్నట్లు తాజా సమాచారం. సమీర్ శర్మ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో అరేబియన్ సముద్రతీరంవైపు గల కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ అండ్ డియులో ఎస్.పి.గా పనిచేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన సమీర్ శర్మ, ఏపిలో విశాఖకు చెందిన ఆమ్రపాలి చెరో రాష్ట్రంలో క్షణం తీరికలేని జీవితాలు గడుపుతున్నప్పటికీ, వారి ప్రేమ ఏమాత్రం బలహీనపడలేదు. త్వరలోనే పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారు.