సిఎం కెసిఆర్ నేడు కలెక్టర్లతో సమావేశం

ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతులకు పట్టదార్ పాస్ పుస్తకాల పంపిణీ, భూరికార్డుల ప్రక్షాళణ, పంచాయితీ రాజ్ వ్యవస్థలో ప్రభుత్వం చేయబోతున్న మార్పులు, రాష్ట్రంలో కొత్తగా 4,000 లంబాడా, గిరిజన తండాలకు గ్రామపంచాయితీ హోదా కల్పించడం, మిషన్ భగీరథ పనుల పురోగతి మొదలైన అంశాల గురించి ఈరోజు సమావేశంలో కలెక్టర్లతో చర్చించి వాటిపై వారి సలహాలు సూచనలు తీసుకొంటారు. అదేవిధంగా ఈ అంశాలలో వారికీ ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.