రాష్ట్రంలో ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాలలో మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పటు కాబోతున్నాయి. వాటిలో అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ల్యాబ్ కు రూ.50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసింది. వాటికి శాస్వితభవనాలు నిర్మించేవరకు తాత్కాలికంగా అద్దె భవనాలలో నడిపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై నాటికి ఈ మూడు కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్స్ పనిచేయడం మొదలవుతుందని రాష్ట్ర అధనపు డిజిపి (టెక్నికల్ సర్వీసెస్) రవి గుప్తా మీడియాకు తెలిపారు.
ఈ మూడు ల్యాబ్స్ మొత్తం 54 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 43 పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారా, మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకొంటామని రవి గుప్తా చెప్పారు. హైదరాబాద్ లో అత్యాధునికమైన ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది కానీ రాష్ట్ర విభజన కారణంగా అది కూడ 10వ షెడ్యూల్ ప్రకారం విభజించబడుతోంది.కనుక తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా మరో మూడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేసుకోవడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో మూడు జిల్లాలలో వీటిని ఏర్పాటు చేస్తోంది.