వెంకటేష్ తో రానా.. మల్టీస్టారర్ ట్విస్ట్..!

దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానాల మల్టీస్టారర్ సినిమా ఎన్నాళ్ల నుండో చర్చల్లో ఉంటున్నా ఆ సినిమాకు ఇంకా ముహుర్తం బయటపడలేదు. ప్రస్తుతం కథల వేటలో ఉన్న ఈ ఇద్దరు మల్టీస్టారర్ గా సినిమా చేయడానికి ముందు ఓ వెబ్ సీరీస్ లో నటిస్తారని తెలుస్తుంది. ఎం.ఆర్ రమేష్ డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వెబ్ సీరీస్ ల హవా కొనసాగుతున్న ఈ సమయంలో దగ్గుబాటి హీరోలు ఇద్దరు మల్టీస్టారర్ గా వెబ్ సీరీస్ కు సిద్ధమవుతున్నారట.

ఇప్పటికే రానా సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లో నటిస్తున్నాడు. అయితే రాబోతున్న ఈ వెబ్ సీరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ మెచ్చే కథ అనగానే ఈ సీరీస్ పై అంచనాలు పెరిగాయి. ఇక వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరక్షన్ లో ఆట నాదే వేటా నాదే సినిమా చేస్తుండగా.. రానా 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసుకున్నాక వెబ్ సీరీస్ పై దృష్టి పెడుతున్నారని తెలుస్తుంది.