యువరాజు.. దిల్ రాజు ఒకటే..!

ఈ ఇయర్ దిల్ రాజు నిర్మించిన 6 సినిమాలు హిట్ అయ్యాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతి నుండి నాని హీరోగా వచ్చిన ఎం.సి.ఏ వరకు 6 సినిమాలు 6 సిక్సులు కొట్టిన దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇయర్ 2017 గా ఓ ఈవెంట్ ఏర్పాటుచేశాడు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజుని యువరాజుతో పోల్చాడు డైరక్టర్ హరిష్ శంకర్. అప్పట్లో యువరాజు 6 బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఇయర్ దిల్ రాజు 6 సినిమాలకు 6 సూపర్ హిట్ సిక్సులు కొట్టాడని అన్నాడు.

ఈ ఇయర్ దిల్ రాజు నించిన శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎం.సి.ఏ ఇలా ఆరు సినిమాలు అనుకున్న హిట్ కొట్టాడు. ఆరు సినిమాల యూనిట్ అందరిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు కోడిరామకృష్ణను సత్కరించడం జరిగింది. డైరక్టర్ కు స్వేచ్చనిచ్చే విషయంలో ఆ బాధ్యత అంతా దిల్ రాజు షేర్ చేసుకుని సినిమా మొదలైన నాటి నుండి పూర్తయ్యేదాకా దర్శకుడికి సపోర్ట్ గా ఉంటాడని దిల్ రాజుని ప్రశంసల్లో ముంచెత్తాడు హరీష్ శంకర్.