
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడంలో అతని కష్టం అందరికి తెలిసిందే. ఇక పవన్ గురించి చెప్పను బ్రదర్ ఎపిసోడ్ చేసిన రచ్చ అంతా తెలిసిందే. ఆ కామెంట్స్ తో పవన్ ఫ్యాన్స్ కు దూరమైన బన్ని నష్టనివారణ చర్యలు చేశాడు. ఇక ఇప్పుడు వ్యవహారం సర్ధుమనిగింది అనుకుంటున్న టైంలో ఒక్క క్షణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మళ్లీ బన్ని ఫ్యాన్స్ పై మిస్ ఫైర్ అయ్యాడు.
ఈసారి తన ఫ్యాన్స్ నే టార్గెట్ చేశాడు బన్ని. ఈమధ్య అల్లు అర్జున్ ఆర్మీ గ్యాంగ్ తో బన్నికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ హంగామతో బన్ని ఎక్కడ ఉంటే అక్కడ గోల గోల చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన అల్లు శిరీష్ ఒక్క క్షణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా చెప్పేది వినండి అంటూ ఫైర్ అయ్యాడు.
సంస్కారం అనేది చాలా ముఖ్యం.. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారిని మాట్లాడనివ్వాలి.. అదే రెస్పెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ అని అన్నాడు. ఆ సంస్కారం లేకపోతే ఎలా అంటున్నాడు. అభిమానులు గోల చేయడం కామనే కాని మాట్లాడే విషయం అర్ధం కాకుండా కేకలేయడం తనని అసహనానికి గురి చేస్తుందని అంటున్నాడు బన్ని.