
రంగస్థలం తర్వాత చరణ్ బోయపాటి సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. ఇక బోయపాటి శ్రీను సినిమా మొత్తం రాజస్థాన్ బ్యాక్ డ్రాప్తో వస్తుందని అంటున్నారు. సినిమా 70 శాతం అక్కడే షూటింగ్ జరుపుకుంటుందట.
ఇక మిగతా 30 శాతం రామోజి ఫిల్మ్ సిటీలో ఉంటుందట. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జయ జానకి నాయకా సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న బోయపాటి శ్రీను ఈసారి రాం చరణ్ తో మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు.