ఫిదా క్రేజ్ తో రవితేజతో ఛాన్స్..!

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్ బొమ్మే అందరికి తెలిసిందే. వరుణ్ తేజ్ కు తన కెరియర్ లో మొదటి సక్సెస్ ఇచ్చిన సినిమా అది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక ఆ సినిమా హిట్ లో తెర వెనుక పాత్ర పోశించిన వ్యక్తి మ్యూజిక్ డైరక్టర్ కార్తిక్. సినిమాలో సాంగ్స్ అంత పెద్ద హిట్ అయ్యిందంటే అతని ప్రతిభే.

ఫిదా మ్యూజిక్ డైరక్టర్ కు రవితేజ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాకు కార్తిక్ మ్యూజిక్ డైరక్టర్ గా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఫిదా క్రేజ్ తో కార్తిక్ కు రవితేజ పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడట. మొత్తానికి కార్తిక్ తన తర్వాత సినిమా లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. మరి ఫిదా రేంజ్ లోనే మాస్ రాజా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తాడని ఆశిద్దాం.