
గోవా బ్యూటీ ఇలియానాకు సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక్కడ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న అమ్మడు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడికి పరుగులు తీసింది. బర్ఫీతో బాలీవుడ్ కెరియర్ మొదలు పెట్టిన ఇల్లి బేబ్ సరైన సక్సెస్ అందుకోలేదు. ఇక ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం నడిపిస్తున్న అమ్మడు ఇన్నాళ్లు ఆ రిలేషన్ సీక్రెట్ గా ఉంచింది. అప్పుడప్పుడు ఫోటోలు పెడుతున్నా వారు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అనుకున్నారు.
అయితే క్రిస్ మస్ సందర్భంగా ఈ ఇయర్ మోస్ట్ ఫేవరైట్ టైం అని పెడుతూ ఫోటో బై హబ్బీ అని పెట్టింది. కచ్చితంగా ఆ ఫోటో తీసింది ఆండ్రూనే అని తెలుస్తుంది. అయితే ఫోటో బై హబ్బి అని పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటా అని ఆశ్చర్యపడుతున్నారు. ఆల్రెడీ పెళ్లైందని కొందరు అంటుంటే.. కాబోయే శ్రీవారు కనుక అమ్మడు అలా పెట్టిందని అంటున్నారు. మరి ఇలియానా ఏం చెప్పింది అన్నది ఇప్పుడు అందరికి కన్ ఫ్యూజన్ గా మారింది.