ఫ్యాన్స్ ను నిరాశ పరచిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ ను ఆపేసిన చిత్రయూనిట్ క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తారని అన్నారు. కాని అనివార్యకారణాల వల్ల అది జనవరి మొదటి వారానికి పోస్ట్ పోన్ చేశారట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. క్రిస్ మస్ కు అజ్ఞాతవాసి ట్రైలర్ తో పండుగ మరింత సంబరంగా జరుపుకుందాం అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశా మిగిల్చారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కు విశేష స్పందన వస్తుంది.