
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సిం హా. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో విజయవాడలో రిలీజ్ చేశారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలయ్య జై సిం హా మరోసారి మాస్ మసాల ప్యాకేజ్ అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యాన్స్ కు మళ్లీ బాలయ్య మార్క్ పక్క మాస్ మూవీగా ఈ సినిమా వస్తుంది.
ఇక సినిమాలో డైలాగ్స్ అయితే స్పెషల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హరిప్రియ, నటాషా ధోషిలు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. పక్కా హిట్ ఫార్ములాతో రాబోతున్న ఈ సినిమా బాలయ్యకు హిట్ కన్ఫాం అంటున్నారు. క్రమం తప్పకుండా సంక్రాంతికి సినిమా ప్లాన్ చేసుకుంటూ వస్తున్న బాలకృష్ణ ఈ జై సింహాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.