
మంచు మోహన్ బాబు చాలాకాలం తర్వాత లీడ్ రోల్ లో వస్తున్న సినిమా గాయత్రి. మదన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ రివీల్ అయ్యింది. నెరిసిన గెడ్డంతో మోహన్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది. గాయత్రి లుక్ తో మోహన్ బాబు సర్ ప్రైజ్ చేశారని చెప్పాలి.
ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. తన నటనలో ప్రత్యేక శైలి కనబరిచే మోహన్ బాబు ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేస్తారు. ప్రస్తుతం మహానటిలో కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్న మోహన్ బాబు గాయత్రి సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నారట. మరి ఈ సినిమా అంచనాలను అందుకుని మోహన్ బాబుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.