
నాచురల్ స్టార్ నాని సినిమా అంటే హిట్ గ్యారెంటీ అన్న సంకేతాలు వచ్చాయి. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని ఈ గురువారం ఎం.సి.ఏ సినిమాతో వచ్చాడు. శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాకు పోటీగా అఖిల్ హలో రిలీజ్ అయ్యింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
నాని వర్సెస్ అఖిల్ పోటీలో వాస్తవంగా చెప్పాలంటే ఈసారి అఖిల్ దే పైచేయి అయ్యిందని చెప్పొచ్చు. నాని ఎం.సి.ఏ కలక్షన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ గా నడిపించే సరికి అనుకున్న రేంజ్ అందుకోలేదు. అయితే అఖిల్ హలో కథ పాతదే అయినా విక్రం కుమార్ స్క్రీన్ ప్లే అందంగా ఉండే సరికి ఈ పోటీలో అఖిల్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.
నాని మొదటి రోజు 7.71 కోట్లకు పైగా కలక్షన్స్ షేర్ సాధించగా.. అఖిల్ హలో 4.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండు సినిమాల వసూళ్లు బాగున్నా నాని సినిమాపై డివైడ్ టాక్ రావడం విశేషం. ఎం.సి.ఏ సినిమాపై దిల్ రాజు ముందునుండి చెబుతున్న సిక్సర్ల థియేరీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.