
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విక్రం సిరి డైరక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. అసలైతే సంక్రాంతి బరిలో దిగాలని చూసిన ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది. జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుందట. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రవితేజకు మళ్లీ హిట్ ఇస్తుందని అంటున్నారు.
రీసెంట్ గా అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమా చేసిన రవితేజ ఆ సినిమా హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. అయితే జనవరి 26న అనుష్క భాగమతి సినిమా రిలీజ్ కాబోతుంది. అదే కాకుండా విశాల్ అభిమన్యుడు కూడా ఆరోజు రిలీజ్ అనుకున్నారు. సంక్రాంతి పోటీ తప్పుకున్న ఈ సినిమాల మధ్య రవితేజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.