భర్తని స్టార్ చేయడమే లక్ష్యం..!

స్టార్ హీరోయిన్ గా సమంత క్రేజ్ అందరికి తెలిసిందే. అక్కినేని కోడలుగా మారాక అమ్మడు సినిమా విషయంలో మాట మార్చింది. సాధ్యమైనంతవరకు సమంత తక్కువ సినిమాలే చేయాలని చూస్తుంది. ఇక కొత్తగా సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుందట. కన్నడ సూపర్ హిట్ సినిమా యూటర్న్ ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉంది సమంత. 

అంతేకాదు తన బ్యానర్ లో భర్తని హీరోగా పెట్టి సినిమాలు చేయాలని చూస్తుంది. ఎలాగైనా చైతుని స్టార్ గా చేయడమే లక్ష్యంగా సమంత ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ గా రంగస్థలం సినిమా చేస్తున్న సమంత ఆ తర్వాత ఏ సినిమా సైన్ చేయలేదు. రీసెంట్ గా నటించిన రాజు గారి గది-2 అనుకున్న ఫలితాన్ని అందించడంలో విఫలమైంది.