
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సినిమాలో భూమిక ప్రత్యేక పాత్రలో నటించింది. అయితే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగం మొత్తం ఎంటర్టైన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ చెడగొట్టాడని అంటున్నారు.
అయితే ఈ సినిమా ప్రభావం నాని మీద పడుతుందని చెప్పొచ్చు. సినిమా కథల విషయంలో నాని ఇక నుండి జాగ్రత్తపడక తప్పదని అంటున్నారు. వరుస హిట్లతో వస్తున్న నాని క్రేజ్ పెంచుకోగా సరైన కథలను ఎంపికచేసుకోకపోతే కెరియర్ మళ్లీ సందిగ్ధంలో పడక తప్పదని అంటున్నారు. ఎం.సి.ఏ సినిమా నాని చేయాల్సింది కాదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.