
పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో ఓ సాంగ్ పాడటమే.. ఆ సాంగ్ ఆడియో ఆల్బం లో రిలీజ్ చేయలేదు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా పవర్ స్టార్ సాంగ్ రిలీజ్ చేస్తారట.
మొదటి సినిమానే అయినా తెలుగులో అనిరుద్ తన మార్క్ ఒకటి ఏర్పరచుకున్నాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బు స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచాలున్నాయి. మరి సినిమా ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి. నిన్ననే పవన్ పాటను పూర్తి చేశాడని ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశారు.