
నందమూరి నటసింహం బాలకృష్ణ 102వ సినిమాగా వస్తున్న మూవీ జై సింహా. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతారం హరిపిర్య, నటాషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. టీజర్ లో బాలయ్య మాస్ హీరోగా కనిపించారు. కొన్నాళ్లు తన మార్క్ మాస్ సినిమాలకు దూరంగా ఉన్న బాలయ్య బాబు మరోసారి తన పంథాలో జై సింహా చేశాడని అనిపిస్తుంది.
ఇక సినిమాలో డైలాగ్స్ అయితే అదుర్స్ అనిపిస్తున్నాయి. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తది.. అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. కథ కథనాలు కొత్తగా ఉంటాయని అంటున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా బాలకృష్ణకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.