
మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమా అంచనాలను అందుకోవడంతో కొత్త జోష్ నింపుకున్నాడు రవితేజ. ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్న రవితేజ ఆ సినిమా తర్వాత స్పెష చబ్బీస్ సినిమా రీమేక్ లో నటిస్తాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా గ్యాంగ్ సినిమా వస్తుంది. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ స్పెషల్ చబ్బీస్ సినిమా రీమేక్ గా తెరకెక్కిందట. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆ సినిమా కథ బేస్ చేసుకునే గ్యాంగ్ కథ సిద్ధం చేశాడట. అయితే స్పెషల్ చబ్బీస్ రైట్స్ కూడా కొనేశారట. ఈ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా రిలీఎజ్ అవుతుంది.