తెలంగాణా కవుల మీద జయహో సాంగ్..!

తెలంగాణ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు మహాసభల సందర్భంగా తెలగాణా కవుల గొప్పతనం గురించి చెబుతూ ఓ పాట రూపొందించారు. తెలంగాణా కవుల పాట జైహో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఇందులో టాలీవుడ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, సునీల్ కనిపించారు. ఇక హీరోయిన్స్ లో రీతు వర్మ, లావణ్య త్రిపాఠి, హెబ్భా పటేల్, షాలిని పాండే కనిపించారు.    

వీరితో పాటుగా సింగర్స్ రేవంత్, సునీతలు.. లిరిసిస్ట్ చంద్రబోస్ మ్యూజిక్ డైరక్టర్ సాయి కార్తిక్ కూడా ఈ సాంగ్ లో కనిపించి అలరించారు. తెలంగాణా కవుల గొప్పదనం గురించి అంతేగొప్పగా ఈ పాటలో వివరించారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో ఈ పాట చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట హడావిడి చేస్తుంది. గోల్కొండ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ పాట విజువల్ పరంగా అద్భుతంగా ఉంది.