భాగమతి టీజర్.. మరో అరుంధతి రాబోతుంది..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్ పాడుబడ్డ బంగ్లా.. అందులో మన హీరోయిన్ ఎంట్రీ.. ఆ తర్వాత సడెన్ గా ఆమె తన ఎడమ చేతికి మేకు దించుకోవడం ఇలా టీజర్ తో ఆసక్తి రేకెత్తించేలా చేశారు.

సినిమా టీజర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ మార్కులు కొట్టేయగా.. విజువల్స్ పరంగా గ్రాండ్ గా యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఫాంలో లేకపోయినా సరే అశోక్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నారు లీడింగ్ ప్రొడ్యూసర్స్ వంశీ, ప్రమోద్. మరి టీజర్ ఇంప్రెస్ చేసేలా ఉండగా సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని అంటున్నారు. 

ఇక ఈ టీజర్ చూసిన వారు అరుంధతి లానే ఇది కూడా అనుష్కకు పెద్ద హిట్ ఇస్తుందని అంటున్నారు. టీజర్ పై పాజిటివ్ రెస్పాన్స్ రాగా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. జనవరి 26న రిలీజ్ అవనున్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఉంటుందో లేదో చూడాలి.