ఎంతమంది వచ్చెళ్లినా.. వాళ్ళని మర్చిపోలేం..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫిదా సక్సెస్ తర్వాత అదే హిట్ జోష్ తో చేసిన సినిమా తొలిప్రేమ. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా కొద్ది గంటల క్రితం సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక టీజర్ లో వెంకీ అట్లూరి చెప్పించిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మన జీవితంలో ఎంతమంది అమ్మాయిలు వచ్చెళ్లినా.. ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేం అంటూ హీరో చెప్పడం అదిరిపొయింది. 

ఇదో ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా అనిపిస్తున్నా ఫస్ట్ లుక్ లో వరుణ్ తేజ్ యంగ్ గా కనిపించగా టీజర్ లో మాత్రం గెడ్డం లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్ 35 సెకన్లలో తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించాడు. తొలిప్రేమా.. నీ గుండెలో గాయమా అంటూ వచ్చిన సాంగ్ కూడా అలరించింది.

మొత్తానికి ఫిదా తర్వాత వరుణ్ ఓ ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నాడని చెప్పొచ్చు. చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. చూస్తుంటే వరుణ్ తేజ్ మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.