
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో నిన్న నోవాటెల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమా దర్శకుడు త్రివిక్రం ఎప్పటిలానే తన మాటలతో అలరించాడు. ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు అంటూ మొదలు పెట్టిన త్రివిక్రం స్పీచ్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపం చూస్తారని త్రివిక్రం చెప్పడం విశేషం.
సినిమా తప్ప వేరే ఏ పనంటూ తెలియని మణికణ్ణన్ గారు.. ఆర్ట్ డైరక్టర్ ప్రకాశ్ గారు సినిమా మంచి అవుట్ పుట్ కు కారణమయ్యారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అంతా కృతజ్ఞతలను తెలిపారు త్రివిక్రం. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నానని చెప్పిన త్రివిక్రం.. పవన్ గురించి చెబుతూ కళ్యాణ్ ఎంతిష్టమో నేను చెప్పక్కర్లేదు.. ఆయనతో సినిమాల పరంగా మళ్లీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని చెబుతూ మరోసారి ఎందరో మహానుభావులు అందరికి వందనాలంటూ ప్రసంగాన్ని ముగించాడు త్రివిక్రం శ్రీనివాస్.