
అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న హలో సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే భారీ రేంజ్ లో చేస్తుండగా సినిమాను ఇంకాస్త ప్రేక్షకుల్లో తీసుకెళ్లేలా ఈరోజు సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు వస్తున్నారని టాక్.
నాగార్జున ఆహ్వానం మేరకు చిరంజీవి వస్తుండగా.. అఖిల్ కోసం చరణ్ సై అన్నాడట. మొత్తానికి అక్కినేని హీరో కోసం మెగా సపోర్ట్ బాగానే వాడేస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోవడం కన్ఫాం అంటున్నారు. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న హలో సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.